Home  »  Featured Articles  »  మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్.. అసలు మేటర్ తెలిస్తే షాక్.!

Updated : Aug 21, 2026

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, టాలీవుడ్ టాప్ పొజిషన్ కి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా 'ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్'తో మరెవరికి సాధ్యంకాని రికార్డు చిరంజీవి సొంతం.

చిరంజీవి తనదైన నటన, డ్యాన్స్, మాస్ ఎనర్జీతో.. తెలుగు సినిమా మార్కెట్ ను పెంచుకుంటూ రావడమే కాకుండా, ఏకంగా ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్ తో చరిత్ర సృష్టించారు.

1983లో వచ్చిన ‘ఖైదీ’ సినిమాతో ఈ చరిత్రకు తొలి అడుగు పడింది. అంతవరకు తెలుగు తెరపై ఉన్న హీరోల శైలిని పూర్తిగా మార్చేసింది ఈ సినిమా. కళ్ళల్లో ఆవేశం, గుండెల్లో అగ్నిపర్వతం, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల తుఫాన్ సృష్టించి, చిరంజీవిని ఒక్కసారిగా స్టార్ గా మార్చేసింది. 

అయితే ఆ తర్వాత ఆయన రెండో ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి దాదాపు నాలుగేళ్లు సమయం పట్టింది. 1987లో వచ్చిన ‘పసివాడి ప్రాణం’తో సెకండ్ ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ ఈ సినిమా బ్రేక్ చేసింది. అంతేకాదు, టాలీవుడ్ కు బ్రేక్ డ్యాన్స్‌ను పరిచయం చేసిన ఘనత కూడా ఈ సినిమా సొంతం.

కానీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. 1987లో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ తర్వాత ప్రతి ఏడాది ఇండస్ట్రీ హిట్ కొట్టుకుంటూ వచ్చారు చిరంజీవి. 1988లో ‘యముడికి మొగుడు’, 1989లో ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, 1990లో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, 1991లో ‘గ్యాంగ్ లీడర్’, 1992లో ‘ఘరానా మొగుడు’. ఇలా వరుసగా ఆరేళ్ళపాటు ప్రతి ఏటా ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. కలలో కూడా ఊహించని ఈ ఘనతను సాధించి చూపించారు చిరంజీవి.

ముఖ్యంగా ‘ఘరానా మొగుడు’ సాధించిన రికార్డులతో చిరంజీవి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన మొదటి సినిమాగా ఇది చరిత్ర పుటల్లోకెక్కింది. ఈ సినిమాతో  చిరంజీవి.. అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటూ, ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిశారు.

1992లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ తర్వాత ఎనిమిదో ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి.. చిరంజీవికి దాదాపు పదేళ్లు సమయం పట్టింది. 2002లో వచ్చిన ‘ఇంద్ర’ సినిమాలో.. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చిరు చూపించిన విశ్వరూపానికి బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. 25 కోట్ల షేర్ మార్కును దాటిన తొలి చిత్రంగా ఇది టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది.

ఇలా దాదాపు 20 ఏళ్ళ కాలంలో మొత్తంగా 8 ఇండస్ట్రీ హిట్స్ తో.. ఎప్పటికీ చెరిగిపోని రికార్డును చిరంజీవి సొంతం చేసుకున్నారు. 

ఇప్పటికీ మెగాస్టార్ తన బాక్సాఫీస్ స్టామినా చూపుతూనే ఉన్నారు. రీఎంట్రీ తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో నాన్-బాహుబలి రికార్డులు సృష్టించారు. అలాగే గతేడాది వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. 70 ఏళ్ళ వయసులోనూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి తెలుగువన్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

 

 

 

Chiranjeevi, Birthday, Industry Hits

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.